- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగం సీఐ వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
సంగం సీఐ వేధింపులు తాళ్లలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) సంగంలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సీఐ వేమారెడ్డి(CI Vemareddy) వేధింపులు భరించలేకపోతున్నానంటూ, తన చావుకు ఆయనే కారణమంటూ జమీల(Jameela) అనే మహిళ పురుగులు మందు తాగి సెల్ఫీ వీడియో తీశారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చేజెర్ల మండలం ఆదరుపల్లిలో కొంతకాలం క్రితం మక్బూల్ జాన్, జమీల మధ్య ఇంటి వివాదం కొనసాగింది. అయితే విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు.. ఇల్లు జమీలాదేనని తేల్చి చెప్పారు. అయితే స్థల వివాదంలో సీఐ వేమారెడ్డి జోక్యం చేసుకున్నారని, తనను 8 నెలలుగా ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయం పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని జమీల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చావుకు సీఐ కారణమంటూ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం మహిళ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. సివిల్ వివాదంలో తలదూర్చిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






