ఈ స్టాంప్ స్కాంలో కొత్త కోణం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 05:53:38  IST  )

ఈ స్ట్రాంప్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ...

ఈ స్టాంప్ స్కాంలో కొత్త కోణం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన ఈ స్ట్రాంపు కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే సురేంద్రబాబును ఇరికించే ప్రయత్నం జరిగినట్లుగా తేలింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులతో మారుతి ఫోన్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితులు ఎర్రప్ప, మోహన్ బాబును ఈ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితులను విచారించారు. దీంతో పలు సంచలన విషయాలు బయటకు చెప్పారు. నిందితులు ఎర్రప్ప, మోహన్ బాబు నుంచి ఎస్ఆర్సీ ఇఫ్రా డెవలపర్స్‌కు చెందిన ఖాళీ ఈ స్టాంప్ పేపర్లను మాజీ ఎమ్మల్యే కుమారుడు ఉన్నం మారుతి చౌదరి తీసుకున్నారు. ఎర్రప్ప, మోహన్ బాబును మభ్యపెట్టి ఎమ్మెల్యే సురేంద్రబాబుపై మారుతి తప్పుడు ప్రచారం చేయించారని కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు.

Next Story