సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్.. సుదీర్ఘంగా సాగుతోన్న సమావేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-23 08:46:42  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత సమావేశం ప్రారంభమవ్వగా.. పలు అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్.. సుదీర్ఘంగా సాగుతోన్న సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత సమావేశం ప్రారంభమవ్వగా.. పలు అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే పెట్టుబడులకు పెద్దపీటవేస్తూ కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలను కేబినెట్ ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లకు ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక పెట్టుబడుల ప్రోత్సాహక మండలం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. రూ.34 వేలకోట్లతో 35 వేల ఉద్యోగాల కల్పన, రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలుపనున్నారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం, అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు, విశాఖ, తిరుపతి, కర్నూర్, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల రిటైర్మెంట్ల వయసు, అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, గాలివిద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, వాటికి బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై చర్చించనున్నారు.

Next Story