గుండారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి

by velandi.Saikiran |

రాచర్ల గుండారంలో మంగళవారం రూ.15 లక్షల సీసీ రోడ్డుకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం సర్పంచ్ మూడవత్ సరోజనతో కలిసి భూమి పూజ చేశారు.

గుండారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి
X

దిశ, ఎల్లారెడ్డిపేట : మండలంలోని రాచర్ల గుండారంలో మంగళవారం రూ.15 లక్షల సీసీ రోడ్డుకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం సర్పంచ్ మూడవత్ సరోజనతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందటానికి సహకరిస్తామని అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద గుండారం గ్రామాన్ని ఎంపిక చేసిన‌ట్లు వివ‌రించారు. 98 ఇండ్లు ఏకకాలంలో వివిధ దశలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి అభివృద్ధి పని అడిగిన తక్షణమే, మంజూరు చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి గ్రామస్తుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి ఉప సర్పంచ్ జెట్టి కిషన్ డైరెక్టర్లు మిండే శ్రీనివాస్ యాదవ్ సూడిద రాజేందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు శ్రీనివాస్ ముడావత్ భాస్కర్ ఘంటబుచ్చగౌడ్. జజ్జరి మల్లయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story