తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న హోంమంత్రి

by Thanuru Gopichand |

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ తల్లిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.

తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న హోంమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ తల్లిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుంటే కూడా అంతే ఆనందం కలుగుతుందన్నారు. గంగమ్మ గుడి అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడుతుందని తెలియజేశారు. తిరుపతి గ్రామ దేవతగా, కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా గంగమ్మ తల్లి విరాజిల్లుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలన్నారు. పిల్లలకు హనుమంతుడి గొప్పతనం, అర్జునుడి నేర్పరితనం గురించి చెప్పాలన్నారు. రామాయణ మహాభారతాలపై అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఆచార వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారుల నుంచి స్వీకరించారు.

Next Story