జగన్ కు మతిభ్రమించింది..

by Thanuru Gopichand |

జగన్ కు మతిభ్రమించింది, పోలీసులను బట్టలూడదీసి కొడతానని చెప్పడమేంటి..? అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

జగన్ కు  మతిభ్రమించింది..
X

దిశ డైనమిక్ బ్యూరో : జగన్ కు మతిభ్రమించింది, పోలీసులను బట్టలూడదీసి కొడతానని చెప్పడమేంటి..? అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. రౌడీల్లాగా బరితెగించి కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రవర్తించలేదా..? అని ప్రశ్నించారు. వంశీ అరెస్ట్పై ఎందుకు రార్థాంతం చేస్తున్నారని అన్నారు. జగన్ చేష్టలతో గత ఎన్నికల్లో 11సీట్లకు పరిమితమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వైసిపికి రావు అని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని పెమ్మసాని తెలిపారు. నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సూచించారు.

Next Story