జగన్ పై కల్పబుల్ హోమీసైడ్ కేసు.. అంటే ఏంటి? నేరం రుజువైతే ఏ శిక్ష పడుతుంది?

by Naga Rani Yarlagadda |

గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు (Singaiah Death Case) సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ..

జగన్ పై కల్పబుల్ హోమీసైడ్ కేసు.. అంటే ఏంటి? నేరం రుజువైతే ఏ శిక్ష పడుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు (Singaiah Death Case) సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1) కింద నమోదు చేశారు.

అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీ టీవీ ఫుటేజీ, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహపూరిత హత్య (Culpable Homicide not amounting to murder)గా పరిగణిస్తున్నారు. దాంతో బీఎన్‌ఎస్‌ కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటు 5–10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ (Non Bailable) నేరంగా పరిగణించబడుతుంది.

ఇది మాత్రమే కాకుండా.. ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బీఎన్‌ఎస్‌ సెక్షన్ 49 కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ ను చేర్చినట్లు సమాచారం.

ఈ కేసులో జగన్‌మోహన్ రెడ్డి సహా మరికొంతమంది వ్యక్తులపై నేరారోపణలు పెట్టారు. ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు వర్గాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి. తదుపరి దశలలో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story