- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల రహదారులకు కొత్త పేర్లు.. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు
తిరుమల రహదారులకు కొత్త పేర్లు.. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు. సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
తీసుకున్న నిర్ణయాలు :
= తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
= ముంబై బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం
= ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం
= టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూములు, సీసీ కెమెరాలు
= ఎస్వీ జూనియర్ కాలేజీల డేస్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం
= తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు
= అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు
చివరగా భక్తులకు మెరుగైన సేవలు, సంస్థాగత బలోపేతమే మా లక్ష్యమని పేర్కొన్నారు.






