- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ చైర్మన్ ను కలిసిన నూతన జేఈఓ
టీటీడీ అధికారిగా తెలంగాణ క్యాడర్ రిటైర్డ్ అధికారి.

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ నూతన జేఈఓగా (TTD JEO) తెలంగాణ కేడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ.శరత్(Doctor A.Sharat) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఇటీవలే జీఓ ఆర్టీ నెంబర్ 110ని విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. అయితే 1990 చివరలో మదనపల్లె ఆర్డీఓగా శరత్ గ్రూప్ వన్ హోదాలో విధులను నిర్వహించారు. తరువాత కుప్పంలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేశారు. 2005లో ఐఏఎస్ హోదా పొందారు. అనంతరం ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు బదిలీ అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందువల్లే తెలంగాణ క్యాడర్ లో రిటైర్ అయినప్పటికీ టీటీడీ జేఈఓ పదవికి ఆయన నియమితులైనట్లు తెలియవస్తోంది.
శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్
తిరుమల జేఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఏ.శరత్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును (TTD Chairman BR Naidu) మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారికి సేవ చేయాలని సూచించారు. టీటీడీ పరిపాలన విషయంలో బాధ్యతగా వ్యవహరించి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. అదే విధంగా సంస్థ ప్రతిష్టను పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని నూతన జేఈఓతో అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో సేవాభావంతో, విజయవంతంగా పదవీ కాలం పూర్తి చేయాలని ఆకాంక్షించారు.






