ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైర్మన్ కొనకళ్ల కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-10-05 11:41:51  IST  )

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త చైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ తెలిపారు...

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైర్మన్ కొనకళ్ల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల(APS RTC employees)కు కొత్త చైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ తెలిపారు. ఆర్టీసీలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌పై ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ చైర్మన్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ విలీన సమస్యల(RTC Merge Issues)ను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రయాణికుల కోసం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీని లాభాల నడిపించేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) తెలిపారు. కాగా గతంలో కొనకళ్ల నారాయణ రెండుసార్లు మచిలీపట్నం ఎంపీగా పని చేశారు. మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించడంతో కూటమి పొత్తులో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ మేరకు అధిష్టానం కొనకళ్లను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించింది.

Next Story