మందుబాబులకు గుడ్ న్యూస్.. నూతన బార్ పాలసీ?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-02 05:40:03  IST  )

రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది.

మందుబాబులకు గుడ్ న్యూస్.. నూతన బార్ పాలసీ?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీలో నూతన బార్ పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఏపీ(Andhra Pradesh)లో బార్ పాలసీ ఈ నెల(ఆగస్టు) 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.

నూతన బార్ పాలసీ తీసుకురావాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్ణయించారు. అది పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, నూతన బార్‌ పాలసీ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉండాలని ఎక్సైజ్‌పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ అభిప్రాయపడింది. టూరిజం శాఖ ఇచ్చే సూచనలు ఈ పాలసీలో చేర్చాలని ఆదేశించారు. పారిశ్రామిక కారిడార్లు విస్తరిస్తున్న నేపథ్యంలో బార్లను రీలొకేట్ చేసే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు, 50 స్టార్‌ హోటళ్లలో బార్లు, మైక్రో బ్రూవరీలు ఉన్నాయని అధికారులు వివరించారు.

Next Story