- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటలీలో ఉండి చంద్రబాబుకు బెయిల్ ఇప్పించిన పవన్.. జనసేనికుల సరికొత్త వాదన!
స్కిల్ డెవలప్‌మెట్ కేసులో గత రెండు నెలల క్రితం అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెట్ కేసులో గత రెండు నెలల క్రితం అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, జనసైనికులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బైలుపై ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. జనసేన కార్యకర్తలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.
జగన్ ఇంగ్లాండ్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే.. పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ దెబ్బకు దెబ్బ తీశారని పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి జనసేన కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.






