నేపాల్​ టూ ఏపీ.. సహాయక చర్యలు సక్సెస్​!

by Thanuru Gopichand |   (  Updated:2025-09-11 12:09:21  IST  )

మంత్రి నారా లోకేశ్​చొరవతో నేపాల్‌లోని తెలుగువారు ఖాట్మాండు విమానాశ్రయం నుంచి ఏపీకి బయలుదేరారు.

నేపాల్​ టూ ఏపీ.. సహాయక చర్యలు సక్సెస్​!
X

విమానంలో బయలుదేరిన తెలుగువారు

వారి ఆనందం చూసి తృప్తి కలుగుతోంది

మంత్రి నారా లోకేశ్ ట్వీట్​

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి నారా లోకేశ్​చొరవతో నేపాల్‌లోని తెలుగువారు ఖాట్మాండు విమానాశ్రయం నుంచి ఏపీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో 144 ఏపీ వారిని ప్రభుత్వం తీసుకువస్తోంది. అక్కడి నుంచి మొదట ప్రత్యేక విమా నం విశాఖకు చేరుకోనుంది. విశాఖలో 104మందిని, తిరుపతిలో 40 మందిని దించనుంది. ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం చేసింది. విమానాశ్రయంలో తెలుగువారికి స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలక నున్నారు. విమానాశ్రయాల నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తమను తీసుకు వస్తుండగా విమానంలో తెలుగువారు లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్​ ట్వీట్​చేశారు. ఖాట్మాండు నుండి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక విమానంలో 144 మంది తెలుగువారు చేరుకుంటారని అన్నారు. నేపాల్‌లో ఉన్న తెలుగువారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ఫలించాయన్నారు. గత 36 గంటలుగా వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. తెలుగువారి ముఖాల్లో కనిపించిన ఆనందం, ఊపిరి పీల్చుకున్న తృప్తి ఈ ప్రయత్నాల విజయాన్ని తెలి యజేస్తున్నాయని లోకేశ్​వెల్లడించారు. ఈ సహాయ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్టీజీఎస్, ఎన్ఆర్టీ‌, ఏపీ భవన్ బృందాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరి నిరంతర సేవలతోనే ఈ విమాన ప్రయాణం సాధ్యమైందన్నారు. ఇంకా నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడానికి ఏపీ భవన్ 24/7 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ప్రపంచం ఎక్కడ ఉన్నా, మీకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story