- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తలకాయ్ ఉన్న వాళ్లు చేసే పనేనా..?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో వైసీపీ(Ycp) ఓటమికి వంద కారణాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana)నే చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Mla Kotam Reddy Sridhar reddy) ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేయడం తలకాయ్ ఉన్న వ్యక్తి చేసే పనేనా అని ఆయన ప్రశ్నించారు. పెద్ద వయసులో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెడతారా అని నిలదీశారు. పాత కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu)ను పెట్టిన టార్చర్, కింది స్థాయి ప్రజల వరకూ వేధించిన తీరు, చంద్రబాబుకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంఘీభావం తెలపడం, కూటమికి పునాది వేయడం లాంటివన్నీ ఆఖరి దశలో వైసీపీ ఓటమికి కారణమని చెప్పారు. జగన్(Jagan) అరాచక విధానాలు, టీడీపీ(Tdp) కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర ఒక భరోసానిచ్చిందని, భవిష్యత్తునిచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు తనయుడు లోకేశ్ శభాష్ అంటూ అనిపించుకున్నారని, ప్రజల్లో, కార్యకర్తల్లో నమ్మకం కలిగించారన్నారని తెలిపారు. పాదయాత్రను బ్రేక్ చేయకుండా పట్టణ, గ్రామ ప్రజలతో మమేకం కావడం గెలుపునకు ఓ టర్నింగ్ పాయింట్ అయిందని పేర్కొన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నారా లోకేశ్ పాదయాత్ర అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.






