- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore | భూవివాదం.. కత్తులతో దాడులు!
నెల్లూరు జిల్లాలోని కలిగిరి (Kanigiri) మండలంలో ఉన్న వేపివాపి గ్రామంలో రెండు వర్గాల మధ్య భూవివాదం (Land Issue) నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని కలిగిరి (Kanigiri) మండలంలో ఉన్న వేపివాపి గ్రామంలో రెండు వర్గాల మధ్య భూవివాదం (Land Issue) నెలకొంది. గ్రామంలో నెలకొన్న ఈ భూవివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నమ్మ, సుధీర్ అనేవారిపై దాడి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం అన్నమ్మ, సుధీర్ లకు గ్రామంలోని భూమి విషయమై ఇతరులతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో వారి ప్రత్యర్థులు వారిపై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ ఆకస్మిక పరిణామంతో బాధితులు భయభ్రాంతులకు గురయ్యారు. తమను తాము రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితులు అన్నమ్మ, సుధీర్ లను గ్రామస్తులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడితో ఒక్కసారిగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. భూవివాదం వల్లనే దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషయ్య, నవీన్, బాలాజీ అనే వ్యక్తులు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






