- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు | సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పెంచలయ్య సంతాప సభ
కామ్రేడ్ పెంచలయ్య (Comrade Penchalaiah) పెద్దకర్మ సందర్భంగా సీపీఎం (CPM) ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : కామ్రేడ్ పెంచలయ్య (Comrade Penchalaiah) పెద్దకర్మ సందర్భంగా సీపీఎం (CPM) ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన సభకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy), సీపీఎం నాయకులు మాజీ డిప్యూటీ మాదాల వెంకటేశ్వర్లు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, బిజెపి నాయకుడు ఎర్రబోలు రాజేశ్, ఇతర కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గంజాయి మహామ్మారిని నిర్మూలించాలని పెంచలయ్య ఎంతో పోరాడారన్నారు. రౌడీయిజానికి కూడా వెరవకుండా తన పోరాటం కొనసాగించారన్నారు. అసాంఘీక కార్యక్రమాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు పెంచలయ్య అని కొనియాడారు. గంజాయి మహామ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం అసువులు బాసిన అమరవీరుడు కామ్రేడ్ పెంచలయ్య అని వక్తలు అన్నారు. పెంచలయ్య మరణం సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన మరణానికి కారణమైన గంజాయి ముఠాను సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. తగిన గుణపాఠం తప్పకుండా చెబుతుందన్నారు. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య.. సాధిద్దాం సాధిద్దాం పెంచలయ్య ఆశయాలను సాధిద్ధాం అంటూ బేషజాలు మరచి ముక్తకంఠంతో నినదించారు.
కూటమి నేతలు మాట్లాడుతూ పెంచలయ్య హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. గంజాయి ముఠాతో పాటు దాని సభ్యులపై ఉక్కుపాదం మోపిందన్నారు. అమానవీయ సంఘటన, మానవ సమాజం సహించలేని ఘాతుకం జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ప్రతినిధులు పెంచలయ్య కుటుంబానికి అండగా నిలిచి కొండంత భరోసానిచ్చారన్నారు. ముఖ్యమంత్రి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడమే కాకుండా పెంచలయ్య బిడ్డల చదువు బాధ్యతను తన భుజాలపై వేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. పెంచలయ్య విగ్రహం ఏర్పాటు చేయడమో కాకుండా 50 లక్షలు రూపాయలతో ఆర్టీసీ కాలనీ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మాటలు కంటే చేతల మిన్న అంటూ వారి కుటుంబానికి అన్ని విధాలు ఆదుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు.






