- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NDA: ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) అన్నారు. శుక్రవారం మంగళగిరి(Mangalgiri)లోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్(People Tech Enterprices) సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఈ సంస్థ ఎంఓయూ చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సీఈఓ టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) తెలియచేశారు. వాహన తయారీ, ఆర్అండ్‌డీ కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ లాంటివి ఇందులో ఉంటాయని తెలిపారు.
అలాగే దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవీ పార్కు అని, దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘కర్నూలు జిల్లా ఓర్వకల్లు(Vorvakallu) దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్(Electric Vehicle Park) ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలు రాయి’ అని అన్నారు. అలాగే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.






