NDA: ఆందోళనకు అవకాశం ఇవ్వకండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామజోగయ్య సంచలన లేఖ

by Ramesh Goud |   (  Updated:2025-01-20 06:57:01  IST  )

సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)లకు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య(Harirama Jogaiah) బహిరంగ లేఖ రాశారు.

NDA: ఆందోళనకు అవకాశం ఇవ్వకండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామజోగయ్య సంచలన లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)లకు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య(Harirama Jogaiah) బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఈడ్య్లూఎస్ రిజర్వేషన్ల(EWS Reservations)లో కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేఖలో ఆయన అగ్రవర్ణ పేదల కోసం కేంద్రం 10 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిందని, ఇందులో ఏపీలో జనాబా ప్రతిపాధికన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం(YCP Government) ఏర్పడ్డాక రిజర్వేషన్లను అమలు చేయలేదని, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నదని తెలిపారు.

అలాగే కాపు రిజర్వేషన్ల(Kapu Reservations) కోసం వైసీసీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల కోసం సమీష్టి కృషి తీసుకుందామని చెప్పి, దీక్షను విరమింపజేసినట్లు గుర్తు చేశారు. ఇక ఈ అంశంపై కోర్టులో ఈ నెల 28న విచారణ జరగనుండగా.. ప్రభుత్వ స్టాండ్ ను రిజర్వేషన్లకు అనుకూలంగా కోర్టుకు తెలియపరచాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల విషయంలో కాపులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే కాపు కులస్థులు ఎన్డీఏ కూటమి వెంట నిలిచారని తెలియజేశారు. మరో ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్ల విషయంలో కాపులకు న్యాయం చేయాలని రామజోగయ్య డిమాండ్ చేశారు.

Next Story