- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 23 నుంచి ఏపీలో జాతీయస్థాయి క్రీడోత్సవాలు.. సాక్షి మాలిక్ హాజరు
ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 23 నుంచి ఉద్గమ్ - 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దిశ, మంగళగిరి: ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 23 నుంచి ఉద్గమ్ - 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడాపోటీలకు రాష్ట్ర, రాష్టేతర ప్రాంతాల్లోని పలు యూనివర్సిటీల నుంచి సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు హాజరవుతున్నారు. గురువారం ఉదయం యూనివర్సిటీ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ వేడుకలకు రియో ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్య పతకాన్ని అందజేసిన అంతర్జాతీయ రెజ్లర్ సాక్షి మాలిక్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏడాదికోసారి జాతీయ స్థాయిలో ఉద్గమ్ పేరిట క్రీడా పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పోటీలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలతో పాటు ఈ-స్పోర్ట్స్ కూడా నిర్వహించనున్నారు. మెన్ అండ్ ఉమెన్ పోటీలను వేర్వేరుగా నిర్వహించడంతో పాటు సుమారు రూ.5 లక్షల విలువైన బహుమతులను విజేతలకు అంతజేయనున్నారు. ఈ నెల 25న జరిగే క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఈ బహుమతులను ప్రదానం చేయనున్నారు.
క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను మంగళవారం యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ విర్ జి, అసిస్టెంట్ డైరెక్టర్ సుస్మితా సింగ్ లు పర్యవేక్షించారు. యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య సతీష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్లతో పోటీల గురించి చర్చించి క్రీడాకారులకు అవసరమైన వసతి ఏర్పాట్లపై సమీక్షించారు.






