- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి అగ్రస్థానంలో ఏపీ.. జాతీయ స్థాయి అవార్డు ప్రకటన
పర్యాటక రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. ఈ మేరకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ 'ఇండియా టుడే' నిర్వహించిన నేషనల్ సర్వేలో రాష్ట్ర టూరిజం ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: పర్యాటక రంగం(Tourism Sector)లోనూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మరోసారి సత్తా చాటింది. ఈ మేరకు జాతీయ స్థాయి గౌరవం(National Level Honor) దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ 'ఇండియా టుడే'(India Today) నిర్వహించిన నేషనల్ సర్వేలో రాష్ట్ర టూరిజం ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకుంది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే 'విస్టాడోమ్' రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక మార్గంగా నిలిచింది. ప్రకృతి అందాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
రైలు ప్రయాణానికి ప్రథమ స్థానం
ఈ సర్వేలోని "ఇండియన్ రూట్స్" ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విస్టాడోమ్ రైలు ప్రయాణానికి ప్రథమ స్థానం దక్కినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 15న గోవాలో వైభవంగా జరగనున్న 'ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్- 2026' వేడుకల్లో ఈ పురస్కారాన్ని అధికారికంగా ప్రదానం చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవాల్సిందిగా మంత్రి కందుల దుర్గేష్‌కు ఇండియా టుడే సంస్థ నుంచి అధికారిక ఆహ్వానం పంపింది.
మంత్రి కందుల దుర్గేష్ హర్షం
దీంతో రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ-అరకు రైలు మార్గంలోని లోయలు, కొండలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు దేశ విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని ఆయన కొనియాడారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో ఏపీ టూరిజం అభివృద్ధికి, మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఎంతో దోహదపడుతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.






