- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్ సిలికో లంగ్ మోడల్.. శ్వాసకోశ రోగుల కోసం కొత్త సాంకేతికత!
ఇన్‌హేలర్ మందుల పనితీరును పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను డెవలప్ చేశారు

దిశ, ఫీచర్ : శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు కొన్నిసార్లు ఇన్‌హేలర్ మందులు వాడాల్సి వస్తుంది. ఇవి ఊపరితిత్తుల్లోకి చేరడం ద్వారా వ్యాధిని నయం చేయడంలో సహాయపడతాయి. అయితే అవి సరిగ్గా చేరుతున్నాయా? ఎంతవరకు చేరుతున్నాయనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం తక్కువ. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితికి చెక్‌పెట్టే సాంకేతికతను డెవలప్ చేశారు జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ (Technical University of Munich - TUM) కి చెందిన పరిశోధకులు. దీనిని ‘ఇన్ సిలికో హై-రిజల్యూషన్ హోల్ లంగ్ మోడల్’ అని పిలుస్తున్నారు.
శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన అత్యాధునిక కంప్యూటర్ సహాయంతో రోగి శ్వాస తీసుకునే విధానాన్ని, ఊపరితిత్తుల నిర్మాణాన్ని డిజిటల్ రూపంలో విశ్లేషిస్తారు. దీనివల్ల ఇన్‌హేలర్ ద్వారా పీల్చిన ఔషధం నోరు, గొంతు భాగాలను దాటి ఊపిరితిత్తులలోని చివరి భాగాల వరకు ఏ మేరకు ప్రయాణిస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆస్తమా, సి.ఓ.పి.డి (COPD) వంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడే రోగులకు ఎంతో మేలు చేస్తుంది.
భవిష్యత్తులో ‘పర్సనలైజ్డ్ మెడిసిన్’ అందించడంలోనూ ఇన్ సిలికో హై-రిజల్యూషన్ హోల్ లంగ్ మోడల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుంది. అంటే దీని ద్వారా ప్రతీ రోగి శ్వాస సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మోతాదులో మెడిసిన్ అవసరమో వైద్యులు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతారు. ఫలితంగా ఔషధాల వృథా తగ్గడమే కాకుండా, చికిత్స మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. రోగుల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ డిజిటల్ లంగ్ మోడల్ ఒక మైలురాయిగా నిలవనుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.






