- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 26 నుంచి నరసింహ దీక్షలు: సింహాచలం దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు
విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో ఈనెల 26 నుంచి నరసింహ స్వామి దీక్షలు జరగనున్నాయని దేవస్థానం తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో ఈనెల 26 నుంచి నరసింహ స్వామి దీక్షలు జరగనున్నాయని దేవస్థానం తెలిపింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం స్పష్టం చేసింది. నవంబర్ 26 నుంచి జనవరి 6 వరకు అంటే 32 రోజుల పాటు ఈ నరసింహ దీక్షలు జరుగనున్నాయి అని వెల్లడించింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. మాలధారణ చేసే భక్తులకు తులసిమాల, స్వామివారి ప్రతిమ ఉచితంగా అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 27న కార్తికమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని వరాహ పుష్కరిణి వద్ద గంగాహారతి ఇవ్వనున్నట్లు సింహాచలం దేవస్థానం పేర్కొంది. గంగాహారతి లో పాల్గొనే భక్తులకు ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు, నూనె, ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమాల నేపథ్యంలో అప్పన్న భక్తులు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ నంబరు 93987 34612ను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు సింహాచలం దేవస్థానం వెల్లడించింది.






