- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ వైసీపీకి మరో BIG షాక్.. పార్టీకి ఎంపీ రాజీనామా
పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి, ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి, ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిలో ఉన్నారు. పార్టీలో టికెట్ రావడం ఇక కష్టమే అని భావించిన ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు.
పార్టీ కేడర్ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడటంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ అనిశ్చితికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. నరసరావుపేటకు అధిష్టానం కొత్త అభ్యర్థిని తీసుకువాలనుకుంది. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అందుకే చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్పి రాజీనామా చేశాను అని వెల్లడించారు.






