Nara Lokesh: తెలంగాణ తొలి, రెండో సీఎం టీడీపీ వర్సిటీనే

by Gantepaka Srikanth |

మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ శిక్షణ తరగతుల్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh: తెలంగాణ తొలి, రెండో సీఎం టీడీపీ వర్సిటీనే
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ శిక్షణ తరగతుల్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్. క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తిస్తాం. పార్టీ ఆవిర్భావ రోజున బాగా పనిచేసిన 19 మంది కార్యకర్తలకు వేదికపై కూర్చునే, మాట్లాడే అవకాశం కల్పిస్తాం. తెలంగాణ తొలి, రెండో సీఎం ఇద్దరూ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీనే. నాయకులను తయారుచేసే కార్ఖానా టీడీపీ. కష్టపడి పనిచేసిన అందరికీ అవకాశాలు ఉంటాయి. అందరూ కలిసిగట్టుగా పనిచేయాలి. అప్పుడే మార్పు సాధ్యం’ అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Next Story