- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి సినిమాలను నిషేధించాలి.. పవన్ సమక్షంలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus Scheme) ప్రయాణ పథకాన్ని విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus Scheme) ప్రయాణ పథకాన్ని విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నుంచి బస్సులో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్(Pawan Kalyan), మంత్రి లోకేష్(Lokesh) ప్రయాణించారు. మొత్తం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు మహిళలకు వెసులుబాటు కల్పించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయి. స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంది. 5 వేల కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారని అన్నారని చెప్పారు.
గత ప్రభుత్వం మహిళల ఎదుగుదలను అడ్డుకున్నది. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. చెంప చెల్లుమణేలా ప్రజలు తీర్పు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇంకా కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇక నుంచి మహిళలను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మహిళలను అసభ్యంగా చూపించే సినిమాలు, సిరీస్‌లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలి. మద్యం నిషేధిస్తామని ఓ రాక్షసుడు మాట్లాడారు. విషం లాంటి మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచారు. చెల్లితో రాఖీ కట్టించుకోలేని వాళ్లు మహిళల గురించి మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిస్తే తోలుతీస్తానని చెప్పండి’ అని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






