అమెరికాలో ఐదో రోజు నారా లోకేశ్‌ పర్యటన.. గోల్డీ హైదర్‌తో భేటీ

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలో ఐదో రోజు పర్యటిస్తున్నారు.

అమెరికాలో ఐదో రోజు నారా లోకేశ్‌ పర్యటన.. గోల్డీ హైదర్‌తో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలో ఐదో రోజు పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్.. ఐదోరోజు వరుస భేటీలతో బిజీగా మారారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తో భేటీ అయ్యారు. ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో 18 నెలలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ప్రాసెస్ లో పాలన సాగతోందన్నారు. రాష్ట్రంలో మరో 6 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు.. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని నారా లోకేశ్ తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని హైదర్ గోల్డీకి వివరించారు. లోకేశ్ విన్నపంపై గోల్డీ సానుకూలంగా స్పందించారు.

ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈఓ వాత్సాతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలో నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు (CPPIB) గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ టీమ్ సభ్యుడైన టిమ్ డౌనింగ్ తో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీని పునరుత్పాదక ఇంధన హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఉన్నామని, రాష్ట్రంలో పోర్టులు, లాజిస్టికస్, రోడ్డు ప్రాజెక్టులు, అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. మాస్టర్ ఫండ్స్ లో యాంకర్ ఇన్వెస్టర్ గా ఉండాలని ఆహ్వానించగా.. టిమ్ డౌనింగ్ సానుకూలంగా స్పందించారు. దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Next Story