- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలియకపోతే అడిగి తెలుసుకో’.. జగన్‌కు లోకేష్ కౌంటర్
మెడికల్ కాలేజీ(Medical College)లపై వైఎస్ జగన్(YS Jagan) వ్యాఖ్యలకు మంత్రి లోకేష్(Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కాలేజీ(Medical College)లపై వైఎస్ జగన్(YS Jagan) వ్యాఖ్యలకు మంత్రి లోకేష్(Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేమేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదు. మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుంది. తెలియకపోతే మీ సలహాదారులను అడిగి తెలుసుకో.. కానీ ఏది పడితే అది మాట్లాడకు. పీపీపీ వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదు’ అని లోకేష్ స్పష్టత ఇచ్చారు. కాగా, అంతకుముందు జగన్ మాట్లాడుతూ.. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం.. ఒక్కో మెడికల్ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశాం.. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.






