- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video:తండ్రికి నారా లోకేష్ బర్త్ డే విషెస్.. ఆ వీడియో జోడిస్తూ ఎమోషనల్ కామెంట్స్!
ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు(ఏప్రిల్ 20) వజ్రోత్సవ (75వ) పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు కుమారుడు, మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు "నాన్నగారికి శుభాకాంక్షలు. నా ఇన్‌స్ప్రిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌కు ఓ ఆసక్తికర వీడియోను కూడా జోడించారు. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు విక్టరీలు, విజన్ గురించి వివరించారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘ఆయన్ను ప్రేమించొచ్చు.. ద్వేషించవచ్చు.. కానీ, ఆయన ఊహించిన విజన్‌ను భావితరాలు నింపాధిగా అనుభవించొచ్చు’ అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు.






