- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati : గడ్డికూడా పీకలేరు.. పాకిస్తాన్‌కు నారా లోకేష్ వార్నింగ్
పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని మంత్రి నారా లోకేష్ ప్రార్థించారు. ఉగ్రవాద దాడిలో మరణించినవారి కుటుంబాలకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి పునర్నిర్మాణ (Amaravati Restart) పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ (PM Modi in AP) అమరావతికి విచ్చేశారు. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నరేంద్ర మోడీని సన్మానించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఉగ్రవాద దాడిలో మరణించినవారి కుటుంబాలకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు. పహల్గామ్‌లో మారణకాండ సృష్టించిన వారిని ప్రధాని నరేంద్రమోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని, ఆయన చేసే మాస్టర్ ప్లాన్‌కు పాకిస్థాన్ నామరూపాల్లేకుండా పోతుందని, పాకిస్థాన్ మిస్సింగ్ అని ఏదొక రోజు వార్తల్లో రావడం ఖాయమన్నారు. ఇక పాకిస్థాన్ వాళ్లు భారత్‌లో గడ్డిని కూడా పీకలేరని, నరేంద్రమోదీ తిరిగి కొట్టే దెబ్బకు పాకిస్థాన్ ఆర్మీ దిమ్మతిరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.
అనంతరం అమరావతి నిర్మాణం, ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్లామన్నారు. నాడు రైతుల త్యాగానికి ఫలితంగానే నేడు అమరావతి నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. గత ప్రభుత్వం విధ్వంస పాలన చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబుపై కక్షతో అమరావతిని రాజధానిగా చంపేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడినా.. అమరావతి కోసం పోరాటం ఆగలేదన్నారు. ఆపేదానికి, పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్కకాదు.. ప్రజల గుండెల్లో దాచుకున్న రాజధాని అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిని ఆపే దమ్మెవరికీ లేదని, అమరావతి రైతులు దేనికీ తగ్గేదేలే, అమరావతి అన్ స్టాపబుల్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దుల బండిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ భుజాలపై మోస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ అన్నీ జట్‌స్పీడ్‌తో జరుగుతాయన్నారు.






