- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల పట్టుదల.. ఏపీకి చారిత్రాత్మక విజయాలు: మంత్రి నారా లోకేశ్ విషెస్
ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖితమైంది. 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2025లో రాష్ట్రానికి తొలి జాతీయ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని సూర్య చరిష్మా సాధించి చరిత్ర సృష్టించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖితమైంది. 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2025లో రాష్ట్రానికి తొలి జాతీయ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని సూర్య చరిష్మా సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఘన విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ పేరు జాతీయ స్థాయిలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు తొలిసారిగా జాతీయ స్థాయిలో రజత పతకాన్ని కైవసం చేసుకోవడం మరో గొప్ప విజయంగా నిలిచింది. మహిళల పట్టుదల, అంకితభావం, జట్టు సమన్వయం ఏ స్థాయిలో ఫలితాలు ఇస్తాయో ఈ విజయం స్పష్టంగా చాటింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ‘ఆంధ్రప్రదేశ్‌కు ఇది చారిత్రాత్మక క్షణం. జాతీయ మహిళల సింగిల్స్‌లో తొలి స్వర్ణ పతకం సాధించిన సూర్య చరిష్మా తామిరిపై గర్వంగా ఉంది. అలాగే తొలిసారిగా రజత పతకం గెలుచుకున్న రాష్ట్ర మహిళల జట్టుపై కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇది మహిళల శక్తి, పట్టుదల, జట్టు స్పూర్తికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు అడ్డంకులను చెరిపేస్తూ, తదుపరి తరం కోసం స్ఫూర్తిగా నిలుస్తున్నారు’ అని ప్రశంసించారు.






