- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh : ఆంధ్రా వంటకాలే కాదు...పెట్టుబడులూ స్పైసీ
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్విట్ చేశారు. ఆంధ్రా వంటకాలే కాదు పెట్టుబడులు కూడా చాలా స్పైసీ అంటూ పేర్కొన్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్విట్ చేశారు. ఆంధ్రా వంటకాలే కాదు పెట్టుబడులు కూడా చాలా స్పైసీ అంటూ పేర్కొన్నారు. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చాలా కష్టపడుతోందని వెల్లడించారు. ఆంధ్ర వంటకాలు స్పైసీ అంటారు... ఏపీలో పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని వెల్లడించారు.
కొంతమంది పొరుగువారు ఇప్పటికే ఆ మంట అనుభవిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నారా లోకేష్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇక రెండు రోజుల కిందట విశాఖలో గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే లోకేష్ ట్వీట్ చేశారు. అటు నిన్న చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఉండే విధంగా వైజాగ్ పేరుతో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోర్టల్ ను చంద్రబాబు బుధవారం పోస్టు చేశారు.






