నా అన్వేషణ వీడియోకు నారా లోకేష్ రిప్లై..ఏమన్నారంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-18 11:52:15  IST  )

ప్రముఖ ట్రావెలర్, యూట్యూబర్ నా అన్వేషణ (Na anveshana) ఛానల్ అన్వేష్ గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్స్ (Betting apps) నిషేదం చేయాలంటూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

నా అన్వేషణ వీడియోకు నారా లోకేష్ రిప్లై..ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ట్రావెలర్, యూట్యూబర్ నా అన్వేషణ (Na anveshana) ఛానల్ అన్వేష్ గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్స్ (Betting apps) నిషేదం చేయాలంటూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారిపై అన్వేష్ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్వేష్ రెండు రోజుల క్రితం కొంతమంది సెలబ్రెటీలు గోవిందా అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేశారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు.

టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, వెబ్సైట్‌లలో ఈరోజు 16-4-2025 వరకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాలని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మంత్రి నారాలోకేష్ (Nara lokesh) రిప్లై ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. జూదానికి బానిసై యువత నిరాశలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన ఎన్నో హృద‌య‌విదార‌క గాథ‌ల‌ను తాను విన్నాన‌ని తెలిపారు. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డమే ఈ స‌మ‌స్య‌కు దీర్ఘ‌కాలిక ప‌రిష్కారం అని చెప్పారు. దేశానికి ఆద‌ర్శంగా నిలిచే యాంటీ బెట్టింగ్ విధానం కోసం కృషి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Next Story