టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. నారా లోకేష్ ఘన నివాళి

by Jakkula.Mamatha |

ఇవాళ(మే 20) ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం, స్వాతంత్య్ర సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.

టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. నారా లోకేష్ ఘన నివాళి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ(మే 20) ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం, స్వాతంత్య్ర సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో ప్రకాశం పంతులు సేవలను, ఆశయాలను మంత్రి లోకేష్ స్మరించుకున్నారు. తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఈ మేరకు ‘‘ప్రజా సంక్షేమం కోసం ప్రకాశం పంతులు గారు అహర్నిశలు కృషి చేశారు. అన్యాయాన్ని ఎదిరించడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోను, స్వరాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలకపాత్ర పోషించారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం’’ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Next Story