- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో కొత్త పథకం...వచ్చే ఏడాది నుంచి అమలు!
అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని ( Kalalaku Rekkalu Scheme) అమలు రంగం సిద్ధం చేస్తోంది కూటమి

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినులకు అదిరిపోయే శుభవార్త అందింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని ( Kalalaku Rekkalu Scheme) అమలు రంగం సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. ఉండవల్లి నివాసంలో తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు నారా లోకేష్ వెల్లడించారు.
స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సహాయం అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని లెక్కలతో పాటు బయటపెట్టారు మంత్రి లోకేష్. స్వదేశంలో 88,196 మంది ఉన్నత చదువులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్యా పథకం ఏ విధంగా అమలు చేయాలన్న విషయంపై లోతుగా అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. నిరుపేద విద్యార్థినులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. క్లిక్






