TDP MLA: ఆ పదవికి నారా లోకేష్ వంద శాతం అర్హుడు

by Jakkula.Mamatha |

ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో శనివారం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్న విషయం తెలిసిందే.

TDP MLA: ఆ పదవికి నారా లోకేష్ వంద శాతం అర్హుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో శనివారం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముందుకు అనూహ్య ప్రతిపాదన వచ్చింది. నారా లోకేష్‌(Minister Nara Lokesh)ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సభాముఖంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నానని అంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ట్విట్టర్(Twitter) వేదికగా పేర్కొన్నారు. ఆ పదవికి నారా లోకేష్‌ వంద శాతం అర్హులేనని తెలిపారు. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని గుర్తు చేశారు. లోకేష్ బాబు పోరాట పటిమను చూసి టీడీపీ(TDP) కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నానని ఆయన డిమాండ్‌ చేశారు.

Next Story