బిగ్ ఎంట్రీకి సంకేతాలిచ్చిన లోకేష్.. బుల్లెట్ వీడియో వెనుక అసలు కథ ఇదే!

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ రాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్, తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

బిగ్ ఎంట్రీకి సంకేతాలిచ్చిన లోకేష్.. బుల్లెట్ వీడియో వెనుక అసలు కథ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ రాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్, తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు.

ట్విస్ట్‌తో కూడిన సోషల్ మీడియా పోస్ట్

మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో లోకేష్ స్వయంగా 'రాయల్ ఎన్‌ఫీల్డ్' బైక్ నడుపుతూ కనిపించారు. ఈ వీడియోకు "ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బుల్లెట్ వెహికల్ సిగ్నేచర్ సౌండ్ వినిపిస్తుండటంతో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీలో తన ప్లాంట్‌ను లేదా భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుందనేది దాదాపు ఖాయమైపోయింది. ఇటీవల కాలంలో టాటా, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, ఇప్పుడు వాహన రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులతో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా హింట్ ఇవ్వడంతో అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఏపీకి రాయల్ డేస్ మొదలయ్యాయి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి లోకేష్ తనదైన శైలిలో వినూత్నంగా ఈ విషయాన్ని ప్రకటించడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story