జంబులయ్య వైసీపీ కార్యకర్తే : జగన్ పై మంత్రి లోకేష్ ధ్వజం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంబులయ్య వైసీపీ కార్యకర్తే : జగన్ పై మంత్రి లోకేష్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తేనన్నారు. గొడ్డలి పార్టీ కార్యకర్తలను సైకో జగన్ రంగంలోకి దింపారని ఆరోపించారు. జగన్నాటకాలు చూసి జనం ఛీ కొట్టినా, డ్రామాలు మానడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా అని మంత్రి లోకేష్.. వైసీపీపై ధ్వజమెత్తారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్.. గొడ్డలి పార్టీ కార్యకర్తల్ని రంగంలోకి దింపాడని ఆరోపిస్తున్నారు.

Next Story