- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టింది.. జగన్ పై మంత్రి లోకేష్ విమర్శలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేష్ విమర్శలు కురిపించారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని కుట్రపన్ని వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేష్ విమర్శలు కురిపించారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని కుట్రపన్ని వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని వ్యాఖ్యానించారు. దోషులెవరూ తప్పించుకోలేరని ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు సాగవు అని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని దేశంపేటలో మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ ఆందోళనకు దిగాయి. ఈ ఘటనకు టీడీపీ నేతలే కారణం అని వైసీపీ ఆరోపిస్తుంటే ఇది వైసీపీ నేతల కుట్రనే అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.






