Nara lokesh; వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా...వైసీపీ కార్యకర్తలపై లోకేష్ ఆగ్రహం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-01 06:12:28  IST  )

వాళ్లేమీ మారలేదు, వాళ్లేమీ మారరు కూడా అంటూ వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేత, మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యం సందర్భంగా వెళ్లిన అభిమానులు వైసీపీ జెండాలు చేతిలో పట్టుకుని సైకిల్‌ను తొక్కుతూ,

Nara lokesh; వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా...వైసీపీ కార్యకర్తలపై లోకేష్ ఆగ్రహం
X

దిశ‌, వెబ్ డెస్క్: వాళ్లేమీ మారలేదు, వాళ్లేమీ మారరు కూడా అంటూ వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేత, మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యం సందర్భంగా వెళ్లిన అభిమానులు వైసీపీ జెండాలు చేతిలో పట్టుకుని సైకిల్‌ను తొక్కుతూ, దానిపై దాడి చేస్తూ హల్ చల్ చేశారు. ఈ వీడియోను లోకేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఏ ముహూర్తాన సైకో అని పేరు పెట్టామో.. ఆ పేరును నిరంతరం సార్ధకం చేసుకోవడానికి పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందుకే నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ అని మండిపడ్డారు. వాళ్లకు సైకో నాయకుడు ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కుని దానిని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్లు చేస్తున్న వికృత చేష్ట‌ల‌ను స‌మాజం మ‌రింత‌గా అర్థం చేసుకోవాల‌ని వీడియో షేర్ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ వీడియో మైల‌వ‌రంలో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభ‌కార్యానికి వ‌చ్చిన వాళ్లు చేసిన పిచ్చి చేష్ట‌లు అని, తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story