పవనన్నా ఇది మనందరి విజయం : నారా లోకేశ్

by velandi.Saikiran |

పవనన్నా ఇది మనందరి విజయం అంటూ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

పవనన్నా ఇది మనందరి విజయం : నారా లోకేశ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాలలో విద్యార్థులు సాధించిన విజయం అందరి సమిష్టి కృషి అని వ్యాఖ్యానించారు. ఈ విజయంపై అభినందనలు తెలిపిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు లోకేష్. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు... ప్రభుత్వ కృషి వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, అందరి సహకారంతో రాష్ట్ర విద్యాశాఖను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు నారా లోకేష్.

పెమ్మసానితో స‌మావేశం

మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలోని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగిన గుంటూరు పార్లమెంట్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నానని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించామ‌న్నారు.

Next Story