- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"అప్పలరాజు మాష్టారు మీరు గ్రేట్.." : నారా లోకేష్
'మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది' మాష్టారు అంటూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజును ప్రశంసించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : 'మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది' మాష్టారు అంటూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజును ప్రశంసించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. "బల్లెడ అప్పలరాజు మాస్టారు.. మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది.
ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నంలో బోటనీ సబ్జెక్టు బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది. సైన్స్, మోరల్ వేల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్‌ను ఆర్టిస్టిక్‌గా రూపొందించి, నిర్వహిస్తున్న తీరు అభినందనీయం." అంటూ ఆ స్కూల్ కు సంబంధించిన ల్యాబ్ వీడియోను లోకేష్ షేర్ చేసారు.
Next Story






