- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh : విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు కూటమి నేతలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.
Next Story






