- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి నోట నందమూరి తమన్ కామెంట్స్!
ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసేమియా వ్యాధి పై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా నేడు(మంగళవారం) అమరావతిలో నారా భువనేశ్వరి విలేకర్లతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ విజయవాడ(Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారని చెప్పారు.
ఈ క్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడు ఏది ఆశించలేదని, ఆయన కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని నారా భువనేశ్వరి గుర్తు చేశారు. ఎన్టీఆర్(Sr.NTR) బడుగు, బలహీన వర్గాల కోసం రూ.2 కిలో బియ్యం, ఆడ పిల్లలకు ఆస్తి హక్కు చట్టం వంటి వాటిని తీసుకు వచ్చారన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించారని పేర్కొన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వ సాయం లేకుండా పలువురికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని నారా భువనేశ్వరి వివరించారు. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్(Taman)ను సంప్రదించామని ఆమె తెలిపారు. అయితే మొదటగా ఎన్.తమన్ అని తర్వాత సారీ నందమూరి తమన్ అంటూ నారా భువనేశ్వరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.






