- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి స్వీట్ వార్నింగ్!
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) గత కొన్నాళ్లుగా వరుస హిట్స్‌తో, రాజకీయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) గత కొన్నాళ్లుగా వరుస హిట్స్‌తో, రాజకీయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం నందమూరి నట సింహం బాలకృష్ణకు పద్మభూషణ్(Padma Bhushan) అవార్డు(Award) ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నిన్న(శనివారం) రాత్రి బాలకృష్ణ చెల్లి, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి అన్నయ బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమలో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు హాజరయ్యారు. ఈ పార్టీలో భువనేశ్వరి(Nara Bhuvaneswari) మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతున్న క్రమంలో నారా భువనేశ్వరి ‘‘ఇది పబ్లిక్ మీటింగ్ కాదని, గంటలకొద్ది మాట్లాడవద్దని, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని’’ సరాదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి(Anil Ravipudi), మలినేని గోపీచంద్(Malineni Gopichand), ఎస్ఎస్ థమన్(SS Thaman) లాంటి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.






