- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సునకానందం తప్ప ఏమీ సాధించలేదు: వంశీ విడుదలపై స్పందించిన పేర్ని నాని
వల్లభనేని వంశీ విడుదల నేపథ్యంలో పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)పై కేసులో సునకానందం తప్ప ఏమీ సాధించలేదని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) అన్నారు. వల్లభనేని వంశీ బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే వల్లభనేని వంశీని పేర్ని నాని పరామర్శించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి సానుభూతి పెరిగిందని చెప్పారు. ‘‘ మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. చేతబడి చేసుకున్నారు. వల్లభనేని అరెస్ట్ వెనుక నాలుగేళ్ల తర్వాత ప్రజలు అన్ని తెలుసుకుంటారని తెలిపారు. గన్నవరం రాజకీయాల్లో నుంచి వంశీ పారిపోరు కదా..?. అక్రమంగా కేసులు పెట్టారు. ఎప్పుడో జరిగిన సంఘటనపై ఇప్పుడు కేసులు పెట్టడమేంటి..?. కూటమి నాయకులు అణచివేత ధోరణిని వ్యవహరించారు. అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలతో వంశీ ఆరోగ్యాన్ని దెబ్బతీశారు.’’ అని పేర్ని నాని తెలిపారు.






