‘హరిహరవీరమల్లు’ సినిమా వివాదం: పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు

by Vemula.Srinu Prasad |

‘హరిహరవీరమల్లు’ సినిమా వివాదానికి సంబంధించిన పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు..

‘హరిహరవీరమల్లు’ సినిమా వివాదం: పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’(Hari Hara Veera Mallu) సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ రిలీజ్‌ను ఆపేందుకే సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి విచారణకు ఆదేశించారు.

అయితే ఇదే అంశంపై స్పందించిన మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perninani).. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఉండి ప్రజల కోసం పని చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటున్నారని విమర్శించారు. డబ్బులు మాయి.. మా ఇష్టమొచ్చిన రేటుకి టికెట్ రేట్లు పెంచుకుంటామని ఆ రోజు కారుకూతలు కూశారని ఎద్దేవా చేశారు. సినిమా రంగాన్ని ఉద్దరిస్తామని సినిమాటోగ్రఫీని తన పార్టీ జనసేనకు తీసుకున్నారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ సినిమాను ఆపేందుకే థియేటర్ల బంద్ ప్రకటించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వెనుక డబుల్ స్టాండ్, రెండు ముఖాలు ఉన్నాయని పేర్ని నాని విమర్శించారు. సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య గొడవలు జరుగుతుంటే సినిమా వాయిదా వేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. కానీ వారిని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశించడం దివాలా కోరుతనమని ఎద్దేవా చేశారు. సినిమా వాళ్లను, నిర్మాతలను పిలిచి సమస్యలు ఏంటి అని అడిగారా..? అని ప్రశ్నించారు. ప్లాపు సినిమాకు జైలు వేస్తామని బెదిరించడం ఏంటో అని నిలదీశారు. సినిమా, థియేటర్లు ప్రభుత్వానిదా అని గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. థియేటర్లు సమ్మెకు వెళ్లడాన్ని ఆపడానికి పవన్ కల్యాణ్ ఎవరు అని పేర్ని నాని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఓ మంత్రి, అదొకశాఖ, దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story