పోలీసులే కాదు.. ఆయనకు ఎవరైనా ఒకటే: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-13 18:13:08  IST  )

గుంటూరులో పోలీసు సస్పెన్షన్ విషయంలోనూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు...

పోలీసులే కాదు.. ఆయనకు ఎవరైనా ఒకటే: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఐటీడీపీ మాజీ కార్యకార్త కిరణ్(Former ITDP worker Kiran) అరెస్ట్ నేపథ్యంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former MP Gorantla Madhav) హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే మాధవ్ వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరించారని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలోనూ సీఎం చంద్రబాబు(CM Chandrababu)నే మాజీ మంత్రి పేర్ని నాని( Former Minister Perni Nani) తప్పుబట్టారు. ఆయనపై విమర్శలు కురిపించారు.

మచిలీపట్నం వైసీపీ కార్యాలయం(Machilipatnam YCP office)లో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల మెప్పుకోసమే పోలీసులను సస్పెండ్ చేశారని విమర్శించారు. అధికారులను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు సర్వసాధారణమేనని ఎద్దేవా చేశారు. ఎస్సై,సీఐలు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే పోలీసులకు ఏ గతి పడుతుంటే కళ్లారా చూశామని విమర్శించారు. హుందాతనం మరిచిన రెడ్ బుక్ రచయిత లోకేశ్‌, అడ్రస్ లేని పవన్ కల్యాణ్‌ను చూసుకుని రెచ్చిపోతే పోలీసులకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు ఎవరికైనా ఎర వేస్తారని, బలి చేస్తారని విమర్శించారు. అధికారి, బంధువు, పోలీసు, కార్యకర్త ఎవరైనా చంద్రబాబు ఒకటేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Next Story