ఈడీ రైడ్స్‌, ఫైజీ అరెస్ట్‌పై SDPI ఆగ్రహం.. ఉద్యమం ఆగదని హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

ఈడీ రైడ్స్‌, ఫైజీ అరెస్ట్‌పై నంద్యాల SDPI నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈడీ రైడ్స్‌, ఫైజీ అరెస్ట్‌పై SDPI ఆగ్రహం.. ఉద్యమం ఆగదని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ(Bjp) తీసుకొచ్చిన జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నంద్యాల SDPI పార్టీ నేతలు హెచ్చరించారు. నంద్యాల పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలను ఖండించారు. ఈ సందర్భంగా SDPI పార్టీ నేతలు మాట్లాడుతూ బీజేపీ తీసుకొచ్చిన అమైండ్‌మెంట్ బిల్లు(Amendment Bill)ను SDPI వ్యతిరేకిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేశామని చెప్పారు. అందుకు భారీ స్పందన కూడా వచ్చిందన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే SDPI జాతీయ అధ్యక్షుడు ఎమ్‌కే ఫైజీని అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసిందని వ్యాఖ్యానించారు.

ఫైజీ అరెస్ట్‌ను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసలనకు SDPI పార్టీ పిలుపునిచ్చిందని నంద్యాల SDPI పార్టీ నేతలు తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చిందని, ఇది ఓర్వలేకనే నంద్యాల పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఎన్ఐఏ కూడా సోదాలు చేస్తోందని తమకు తెలుసన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎప్పటికైనా టార్గెట్ అవుతాయని చెప్పారు. అక్రమంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రైడ్స్‌ను తాము ఖండిస్తున్నామన్నారు. SDPI పార్టీ కార్యాలయంలో పేపర్లు తప్ప ఏమీ దొరకవన్నారు. ఆ కార్యాలయంలో నేతలు, కార్యకర్తల శ్రమ కనిపిస్తుందని చెప్పారు. ఈడీ చేపట్టిన కేసులు 95 శాతం ఫేక్ అని ఆరోపించారు. ఈ కేసుల విషయంలో ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఎమ్‌కే ఫైజీని విడుదల చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని SDPI పార్టీ నేతలు హెచ్చరించారు.

Next Story