- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి నందిగం సురేశ్
టీడీపీ (TDP) కార్యకర్త ఇసుకపల్లి రాజు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ (TDP) కార్యకర్త ఇసుకపల్లి రాజు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి కోర్టు (Mangalagiri Court) ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిందితుడు వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh)ను తుళ్లూరు పోలీసులు మూడు రోజుల పాటు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సబ్ జైలులో ఉన్న ఆయనను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అనంతరం మూడు రోజుల పాటు నందిగం సరేశ్‌ను ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కాగా, ఈ కేసులో మే 18న సాయంత్రం నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు నేరుగా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు జూన్ 2 వరకు రిమాండ్ విధించగా పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. గతంలో ఓ మహిళ హత్య కేసులో 3 నెలల పాటు జైల్లో ఉన్న నందిగం సురేష్ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు.






