AP News : జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్

by Muthe.Rajitha |

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh), గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు.

AP News : జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh), గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై తుళ్లూరులో జరిగిన దాడి కేసులో గుంటూరు కోర్టు జూన్ 30న షరతులతో బెయిల్ మంజూరు చేసినప్పటికీ, రూ.10,000 షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ఒక రోజు వాయిదా పడింది. ఈ కేసులో సురేష్‌తో పాటు ఆయన సోదరుడు, భార్య, ఇతరులపై రాజును కిడ్నాప్ చేసి, కర్రలు, రాళ్లతో కొట్టిన ఆరోపణలు ఉన్నాయి.

బెయిల్ షరతుల ప్రకారం ఆయన పోలీసులకు అందుబాటులో ఉండాలి. సాక్షులను బెదిరించకూడదు. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి. కాగా జైలు నుంచి బయటికి వచ్చిన సందర్భంగా సురేష్ టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్ రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తాను ఎటువంటి తప్పు చేయకుండానే జైలు జీవితం గడిపానని, తన ప్రాణం పోయే వరకు వైఎస్ జగన్‌తో వెంటే ఉంటానని వ్యాఖ్యానించారు.

Next Story